ములుగులో 184 ధాన్యం కొనుగోలు కేంద్రాలు: కలెక్టర్
MLG: ములుగు జిల్లాలో ఖరీఫ్ పంట కాలానికి 184 దాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ దివాకర్ టిఎస్ వెల్లడించారు. గురువారం వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవి పేట గ్రామంలో ఇందిరా క్రాంతి పథకములో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. FAQ నాణ్యత ప్రమాణాల ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కలెక్టర్ నిర్వాహకులకు సూచించారు.