'సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి'

'సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి'

కోనసీమ: సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోనసీమ జిల్లాకు చెందిన క్లస్టర్ రిజర్వ్ మొబైల్ టీచర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ వద్ద సీఆర్ఎంటీలు సోమవారం నిరసన చేపట్టారు. తమకు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వారికి మాజీ ఎమ్మెల్సీ, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు సంఘీభావం తెలియజేశారు.