డిగ్రీ సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

ATP: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఇంఛార్జ్ వీసీ అనిత బుధవారం విడుదల చేశారు. బీఏ, బీకాం, బీబీఏ పరీక్షలు జనవరిలో జరిగాయి వాటి ఫలితాలను తాజాగా విడుదల చేశారు. విద్యార్థులు యూనివర్సిటీ వెబ్సైట్‌లో ఫలితాలను చూడొచ్చని పేర్కొన్నారు.