డైట్ సెట్ దరఖాస్తు గడువు పెంపు
CTR: డైట్ సెట్ దరఖాస్తుకు గడువు పొడిగించినట్లు కార్వేటినగరం డైట్ ప్రిన్సిపల్ రాజేంద్రప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. తొలుత ప్రకటించిన మేరకు గురువారంతో గడువు ముగిసింది. దీనిని 25వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు వచ్చాయని ఆయన వెల్లడించారు. అర్హులైన అభ్యర్థులు పొడగింపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు.