జిల్లాలో మహిళా ఓటర్లు ఎక్కువ
MHBD: జిల్లాలోని కేసముద్రం, మరిపెడ, తొర్రూరు, డోర్నకల్ మున్సిపాలిటీలు మినహా మిగిలిన 18 మండలాల్లో మొత్తం 5,56,780 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో 2,83,064 మంది మహిళలు, 2,73,682 మంది పురుషులు, 24 మంది ఇతరులు ఉన్నారు. 482 గ్రామ పంచాయతీల్లో 4,110 వార్డు స్థానాలకు రిజర్వేషన్లు ఖరారైన విషయం తెలిసిందే.