ఆలయ అభివృద్ధికి లక్ష విరాళం అందజేసిన వైసీపీ నేత

ఆలయ అభివృద్ధికి లక్ష విరాళం అందజేసిన వైసీపీ నేత

సత్యసాయి: రొళ్ల మండలంలో శుక్రవారం అమ్మాజీ జాతర వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా వైసీసీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హలుకూరు కాంతరాజు, పార్టీ నాయకులతో కలిసి జాతరకు హాజరయ్యారు. దేవాలయం అభివృద్ధి కోసం కాంతరాజు లక్ష రూపాయల విరాళం అందించారు. ఆలయ కమిటీ సభ్యులు కాంతరాజును పూలమాలలు, శాలువాతో సన్మానించారు.