VIDEO: బైక్‌ను ఢీ కొన్న ట్రాక్టర్.. మహిళ మృతి
ములుగు (మం) కన్నాయి గూడెం సమీపంలో శుక్రవారం ద్విచక్రవాహనాన్ని ట్రాక్టర్ ఢీ కొట్టిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కన్నాయిగూడెం గ్రామానికి చెందిన పాయిరాల సుమలత - బిక్షపతి దంపతులు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తుండగా కన్నాయిగూడెం సమీపంలో ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య సుమలత అక్కడే మృతి చెందగా, భర్త బిక్షపతికి గాయాలయ్యాయి.