అత్యవసర ఎలోసీలపై ఎమ్మెల్యే స్పందన
కృష్ణా: విజయవాడలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మంగళవారం ప్రజలను కలుసుకున్నారు. వైద్యం కోసం అత్యవసర ఎలోసీలు పొందేందుకు వచ్చిన వారితో మాట్లాడి, వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఎలోసీలు త్వరగా మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆసుపత్రి యాజమాన్యంతో ఫోన్‌లో మాట్లాడి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.