వర్షపు నీరు రోడ్లపై చేరకుండా చర్యలు చేపట్టండి: కమిషనర్

NLR: నగరపాలక సంస్థ పరిధిలో లోతట్టు ప్రాంతాలలో వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కమిషనర్ నందన్ ఆదేశించారు. రోడ్లపై వర్షపు నీరు చేరకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా కమిషనర్ బుధవారం స్థానిక ఎన్టీఆర్ నగర్, బాలాజీ నగర్ తదితర ప్రాంతాలలో కమిషనర్ పర్యటించారు.