నందిగామ బైపాస్ వద్ద యాక్సిడెంట్

నందిగామ బైపాస్ వద్ద యాక్సిడెంట్

RR: షాద్‌నగర్ నియోజకవర్గం నందిగామ మండల కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఈరోజు తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనుక నుంచి వస్తున్న డీసీఎం ఆ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ డీసీఎంలో ఇరుక్కుపోగా స్థానికుల సహాయంతో సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.