ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయం

AP: బీజేపీ సీనియర్ నేత, విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరికి తీవ్ర గాయం అయింది. లండన్ పర్యటనలో ఉన్న ఆయన బాత్రూమ్‌లో జారిపడటంతో కుడి చేయి విరిగినట్లుగా తెలుస్తోంది.. దీంతో లండన్‌లో ప్రాథమిక వైద్యం తీసుకున్న ఆయనను మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.