నూతన వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

నూతన వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం

NRPT: మాగనూరు మండలం నేరడగం దొడ్డిలో మహిళా సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ఐకేపీ సెంటర్‌ను ప్రారంభించారు. మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు వరి కొనుగోలు కేంద్రం ప్రారంభించామని, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆనంద్ గౌడ్ తెలిపారు. గ్రామ అధ్యక్షుడు సలీం మాట్లాడుతూ.. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు జరిగేలా గ్రామ స్థాయి కమిటీ పనిచేస్తుందని పేర్కొన్నారు.