చెరువులను పట్టించుకోరా..?
MDCL: బోడుప్పల్, చెంగిచెర్ల, పీర్జాదిగూడ ప్రాంతాల్లోని చెరువుల రోజురోజుకు కలుషితమయంగా మారుతున్నట్లు అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెంగిచెర్ల చింతలకుంట చెరువు పరిస్థితి బాగా దిగజారిపోతుంది. అత్యంత ఘాడమైన రసాయనాలు చెరువులో కలుస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు. నీటి కలుషితం, గుర్రపు డెక్క, దోమల వ్యాప్తిపై అధికారులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు