గ్రామసభ నిర్వహించిన ఎంపీడీవో
ప్రకాశం: హనుమంతపురంలో మంగళవారం ఎంపీడీవో రంగ సుబ్బరాయుడు స్వామిత్వపై ప్రత్యేక గ్రామసభను నిర్వహించారు. స్వామిత్వ ద్వారా గ్రామంలో చేపట్టే సర్వే పనుల గురించి ఎంపీడీవో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామంలోని సమగ్ర ఆస్తుల గుర్తింపుకు ఈ సర్వే ఎంత గానో దోహదపడుతుందని, గ్రామస్తులు సహకరించాలని కోరారు.