'రోడ్డు భద్రత నియమాలను పాటించాలి'
SRPT: కోదాడ పట్టణంలోని లారీ ఆఫీస్ స్టేషన్ వద్ద బుధవారం డీసీఎం డ్రైవర్లకు రోడ్డు భద్రతా ప్రమాదాల నివారణ గురించి కోదాడ పట్టణ ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని వాహనాలు కండిషన్‌లో ఉండాలని, క్రాసింగ్ ఓవర్ టెక్ సమయంలో వెనక, ముందు వాహనాలను గమనించాలని సూచించారు.