పోరుమామిళ్ళలో అటవీ అమరవీరులకు ఘన నివాళి
KDP: పోరుమామిళ్లలో రేంజ్ అధికారి రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులర్పించి మౌనం పాటించారు. అనంతరం సిబ్బందిని నిజాయితీగా విధులు నిర్వర్తించాలంటూ రఘునాథ్ రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.