నలుగురిపై కేసు నమోదు.. రెండు డీసీఎంలు స్వాధీనం
NLG: అక్రమంగా గోవులను వధశాలకు తరలిస్తున్న నలుగురు వ్యక్తులు మాదిగ సూర్యం, బల్ల భోజరాజు, బుక్కపోగు విజయ్ కుమార్, పాతూరి నాగయ్యలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు చిట్యాల ఎస్ఐ మామిడి రవికుమార్ తెలిపారు. ఏపీ నుండి రెండు డీసీఎం వాహనాల్లో 26 గోవులను శంషాబాద్‌కు తరలిస్తుండగా వాహనాల తనిఖీలో గుర్తించామని, గోవులను గోశాలకు తరలించామన్నారు.