శివుని జన్మనక్షత్రం విశేషపూజలు
కోనసీమ: మండపేట టౌన్ హాల్ వద్ద గల శ్రీ కామాక్షి ఏక్రామేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. మార్గశిరమాసంలో స్వామి జన్మించిన ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని ఆలయ అర్చకులు బంటుమిల్లి చంద్రశేఖర్ శిష్యబృందంచే మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు.