ములుగుకు చేరుకున్న గవర్నర్ జిష్ణుదేవ్

WGL: రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ములుగుకు చేరుకున్నారు. ఈ మేరకు మంత్రి సీతక్క, కలెక్టర్, ఎస్పీ ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆయన దత్తత తీసుకున్న కొండపర్తి గ్రామాన్ని సందర్శించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం గ్రామస్తుల సమస్యలను తెలుసుకోనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి మేడారం వెళ్లి సమ్మక్క-సారలమ్మను దర్శించుకోనున్నారు.