'మంచినీటి సమస్య పరిష్కారానికి ఆగ్మెంటేషన్ స్కీం'

'మంచినీటి సమస్య పరిష్కారానికి ఆగ్మెంటేషన్ స్కీం'

MBNR: పట్టణానికి మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రూ. 220 కోట్లతో వాటర్ ఆగ్మెంటేషన్ స్కీం చేపట్టినట్లు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం సుమారు 3 లక్షల 30 వేల పట్టణ జనాభాకు సరిపడా నీటి సరఫరాకు సమగ్ర కార్యాచరణ చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం 40 MLD మంచినీరు అవసరం ఉండగా, 20 నుంచి 30 MLD మాత్రమే అందుబాటులో ఉందని పేర్కొన్నారు.