అపూర్వ ఆధ్యాత్మిక క్షేత్రం.. కాళేశ్వరం

అపూర్వ ఆధ్యాత్మిక క్షేత్రం.. కాళేశ్వరం

BHPL: జిల్లాలో గోదావరి- ప్రాణహిత సంగమ తీరంలో వెలసిన కాళేశ్వర ముక్తీశ్వరాలయం త్రిలింగ క్షేత్రాలలో ఒకటి. ఒకే పీఠంపై శివుడు (ముక్తీశ్వర), యముడు (కాళేశ్వర) లింగాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. భక్తులు ముందుగా యముడిని దర్శించి, తరువాత శివుడిని దర్శించుకుంటారు. ముక్తీశ్వర లింగం రంధ్రంలో పోసిన నీరు భూగర్భ నదిలో కలుస్తుందనేది భక్తుల నమ్మకం. మహాశివరాత్రి రోజు భారీగా భక్తులు తరలివస్తారు.