తాడేపల్లిగూడెంలో జర్నలిస్టులకు మెడికల్ క్యాంపులు
W.G: ప్రతి నిత్యం వృత్తిపరమైన ఒత్తిడితో సమాజం కోసం పనిచేసే జర్నలిస్టులు వారి వ్యక్తిగత ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని తాడేపల్లిగూడెం ఇంఛార్జ్ ఆర్డీవో ప్రవీణ్ కుమార్ రెడ్డి సూచించారు. తాడేపల్లిగూడెం ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం జర్నలిస్టులకు వైద్య శిబిరం నిర్వహించారు. జర్నలిస్టు అంటే సమాజానికి దిక్సూచి లాంటి వారని ఆయన పేర్కొన్నారు.