జిల్లా ప్రజలు కుక్కలతో జాగ్రత్త..!
JN: వేసవిలో కుక్కలు కరిచే అవకాశం పెరుగుతుందని జిల్లా బల్దియా సీఎం హెచోవో రాజారెడ్డి హెచ్చరించారు. అధిక ఉష్ణోగ్రతలు, నీటి కొరత వల్ల కుక్కలు అసౌకర్యానికి గురై, దూకుడుగా ప్రవర్తించి దాడి చేసే అవకాశం ఉందని తెలిపారు. ముఖ్యంగా, వేసవిలో కుక్కలు పిల్లలను కనే సమయం కావడంతో పిల్లల రక్షణ కోసం అవి ప్రమాదకరంగా మారతాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు కుక్కలకు దూరంగా ఉండాలని సూచించారు.