భారత నావికాదళానికి సరికొత్త బలం 'అండ్రోత్'

భారత నావికాదళానికి మరో కీలక బలం చేకూరింది. 'అండ్రోత్' అనే జలాంతర్గామి నిరోధక యుద్ధ నౌక నావికాదళంలోకి వచ్చి చేరింది. 77 మీటర్ల పొడవు కలిగిన ఈ నౌక ద్వారా ఆధునిక సోనార్ వ్యవస్థలు, టార్పెడోలు, రాకెట్లను ప్రయోగించవచ్చు. ఇది చిన్న మానవ రహిత నీటి వాహనాలు, మినీ సబ్‌మెరైన్లను సైతం గుర్తించి వాటిని నాశనం చేయగలదు. 80 శాతం స్వదేశీ భాగాలను ఉపయోగించి ఈ నౌకను నిర్మించారు.