TVK పార్టీ సీఎం అభ్యర్థిపై కీలక నిర్ణయం
తమిళనాడు మహాబలిపురంలో తమిళగ వెట్రి కజగం (TVK) ప్రత్యేక జనరల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2026 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ పొత్తుపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని నటుడు, TVK అధినేత విజయ్‌కి ఇస్తూ పార్టీ నాయకులు ఆమోదం తెలిపారు. అలాగే, పార్టీ CM అభ్యర్థిగా విజయ్ పేరును ఖరారు చేశారు. అంతకుముందు కరూర్ తొక్కిసలాటలో మరణించిన 41 మందికి సభ్యులు సంతాపం తెలిపారు.