VIDEO: చంద్రగుండ మఠంలో అమావాస్య వేడుకలు
WNP: గోపాల్ పేట మండల కేంద్రంలోని చంద్రగుండ మఠంలో అమావాస్య సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. పూజారులు చంద్రశేఖర్, మల్లికార్జున్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మఠం ప్రాంగణం భక్తుల రాకతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.