GVMC కౌన్సిల్‌లో కీలక తీర్మానం

AP: జీవీఎంసీ కౌన్సిల్‌లో కీలక తీర్మానం వెలువడింది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అధికారులు తీర్మానం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటీకరణ ప్రకటనను ఉపసంహరించుకోవాలని, కాంట్రాక్ట్ కార్మికులను మళ్లీ తీసుకోవాలని, స్టీల్‌ప్లాంట్‌కు ముడి ఇనుము కేటాయించాలని తీర్మానించారు.