"ఏ త్యాగానికైనా కరేడు రైతులు సిద్ధం"
NLR: ఉలవపాడు (M) కరేడులో భూసేకరణ ప్రక్రియను వెంటనే నిలిపేయాలని భూసేకరణ వ్యతిరేక పోరాట కమిటి కన్వీనర్ మిరియం శ్రీనివాసులు డిమాండ్ చేశారు. కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశిని కలిసి గురువారం వినతి పత్రం ఇచ్చారు. భూములను రక్షించుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. కరేడు గ్రామంలో పోలీస్ ఆంక్షలను ఎత్తివేయాలని కోరారు.