VIDEO: రాజధానిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
GNTR: రాజధాని రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు రైతులను ప్రభుత్వం సన్నద్ధం చేస్తోంది. అమరావతి మండలం ఎండ్రాయి గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మంత్రి నారాయణ రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రికి 4 గ్రామాల రైతులు ఘన స్వాగతం పలికారు. నంబూరి బలరాం అనే రైతు 4 ఎకరాల భూమికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ను మంత్రికి అందజేశారు.