నందన మారెళ్ళలో 'మన ఊరు మన జెండా'
ప్రకాశం: కనిగిరి మండలం నందనమరేళ్ల గ్రామంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 'మన ఊరు-మన జెండా' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గంజి మనోజ్ రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి జేవీ నారాయణ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా రైతులకు అండగా నిలిచారన్నారు.