VIDEO: ఘనంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు కాందాలై రమణ చార్యులు ఆధ్వర్యంలో బ్రాహ్మణోత్తములు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రెండవ రోజు ఆలయంలో యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ట, ధజారోహణం, గరుడ ప్రసాదం కార్యక్రమాలు నిర్వహించారు.