దేవాదుల నీరు విడుదల చేయాలని రైతుల డిమాండ్
WGL: దేవాదుల ప్రాజెక్టు ద్వారా పంటలకు తక్షణమే సాగునీరు అందించాలని అఖిల భారత రైతు సమైక్య జిల్లా అధ్యక్షుడు అహ్మద్ ఇస్మాయిల్ డిమాండ్ చేశారు. సోమవారం సంగెం మండలం గవ్విచర్ల గ్రామంలో ఎండిన పంటలను పరిశీలించి, కాలువలు నిర్మించి పదేళ్లు గడిచినా ఇప్పటికీ నీరు విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పంటలకు నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.