SRH ఓటములపై క్లాసెన్ షాకింగ్ కామెంట్స్
SRH వరుస ఓటములపై ఆ జట్టు స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓటములకు బౌలింగ్ వైఫల్యం కారణం కాదని, బ్యాటర్ల వైఫల్యమేనని స్పష్టం చేశాడు. గత మూడు మ్యాచ్‌ల్లో తాము ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోయామని, ప్రతి మ్యాచ్‌లోనూ కనీసం 40 పరుగులు తక్కువగా స్కోర్ చేస్తున్నామని అభిప్రాయపడ్డాడు. బ్యాటింగ్ విభాగం మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.