విద్యుత్ షాక్‌తో రైతు మృతి
SDPT: విద్యుత్ షాక్‌తో రైతు మృతి చెందిన సంఘటన కొండపాక మండల కేంద్రంలో ఇవాళ చోటు చేసుకుంది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన సుతారి ఆంజనేయులు(65) తన పొలానికి కరెంట్ పెడదామని వెళ్లి విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుకునూరు పల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.