ట్రాఫిక్ రూల్స్‌పై అటో డ్రైవర్స్ అవగాహన
AKP: ఆటోల్లో అనుమతించిన పరిమితికి మించి విద్యార్థులు లేదా ప్రయాణికులను ఎక్కించకూడదని అనకాపల్లి టౌన్ ట్రాఫిక్ సీఐ ఎం. వెంకటనారాయణ అన్నారు. బుధవారం ఆయన ఎస్సై శేషగిరితో కలిసి అనకాపల్లి టౌన్ పరిధిలోని ఆటో డ్రైవర్లతో ట్రాఫిక్ నిబంధనలు, నో-పార్కింగ్ నియమాలు, ప్రజల భద్రతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అటో కార్మికులు పాల్గొన్నారు.