పాకాలలో జాబ్ మేళా.. 860 ఉద్యోగాలు
TPT: పాకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 9న నిర్వహించే జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ మేళాలో 12 బహుళజాతీయ కంపెనీల్లో 860కు పైగా ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. పదో తరగతి నుంచి పీజీ వరకు ఉత్తీర్ణత పొందిన వారు అర్హులని అధికారులు తెలిపారు.