ముంపు ప్రాంతాల్లో యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య పనులు
KMM: ఖమ్మం మున్నేరు ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన నిర్వహించారు. మోతీనగర్, బొక్కలగడ్డ, కాల్వొడ్డు, వెంకటేశ్వరనగర్, సమ్మక్క సారక్క గద్దెల రోడ్డు, ధంసలాపురం తదితర ప్రాంతాల్లో శుభ్రం చేశారు. మిషనరీలు, కార్మికుల సాయంతో రోడ్లపై పేరుకుపోయిన బురదను తొలగించారు. ట్యాంకర్ల ద్వారా శుభ్రం చేసి రోడ్లపై బ్లీచింగ్ చల్లారు.