'ప్రతి రైతు తప్పనిసరిగా ఈ-క్రాప్ బుకింగ్ చేయించుకోవాలి'
ATP: గుత్తి రైతు సేవా కేంద్రంలో సోమవారం ఈ-క్రాప్ బుకింగ్ నమోదుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయ అధికారి ముస్తక్ అహ్మద్ మాట్లాడుతూ.. ఈ క్రాప్ బుకింగ్ చేయించుకున్న రైతులు తమ పేర్లు నమోదును సరిచూసుకోవాలని, ఈ క్రాప్ బుకింగ్ నమోదులో ఏమైనా అపోహలు ఉంటే సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.