ముత్తుకూరులో అధ్వానంగా రోడ్లు

CTR: పెద్దపంజాణి మండలం ముత్తుకూరులో రోడ్లు అధ్వానంగా ఉన్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని బీసీ కాలనీలో రోడ్లు వరి నాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్న పొలం మాదిరి కనపిస్తున్నాయని తెలిపారు. సమస్యపై అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదన్నారు. వర్షం వస్తే పరిస్థితి మరీ దయనీయంగా ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు.