నేడు మంత్రి వాకటి శ్రీహరి పర్యటన వివరాలు
MBNR: బాలానగర్ మండలంలోని మోదంపల్లి గ్రామంలో ఈరోజు మంత్రి వాకటి శ్రీహరి, ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పర్యటించనున్నారని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన బయో-ఫ్లో ఫిష్ ట్యాంకులను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి అధికారులు ఇప్పటికీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు.