VIDEO: నిరసనలో గుండెపోటుతో రైతు మృతి

VIDEO: నిరసనలో గుండెపోటుతో రైతు మృతి

VSP: పెందుర్తి నియోజకవర్గంలోని పొర్లుపాలెం గ్రామంలో రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమంలో దుర్ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ప్రభుత్వంపై నినాదాలు చేస్తూ.. ఉద్యమం కొనసాగిస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఒక రైతు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటనతో నిరసన ప్రాంగణంలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.