అందుకు మూడు నెలల టైం పడుతుంది: వైద్యశాఖ

అందుకు మూడు నెలల టైం పడుతుంది: వైద్యశాఖ

AP: రాష్ట్రంలో స్క్రబ్‌ టైఫస్‌ లక్షణాలతో 9 మంది మృతి చెందినట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు. అయితే వీరంతా ఈ వ్యాధి వల్లే చనిపోయినట్లు ఇప్పటి వరకు నిర్థారణ కాలేదన్నారు. బాధితులు ఎందువల్ల మరణించారనే దానిపై పరిశోధనలు జరగుతున్నట్లు చెప్పారు. వాటి ఫలితాలు రావడానికి కనీసం 2 నుంచి 3 నెలల సమయం పడుతుందని వెల్లడించారు.