నిర్మాణ పనులను పరిశీలించిన కమిషనర్
WGL: గ్రేటర్ వరంగల్ పరిధిలోని 23, 27వ డివిజన్‌లలో జరుగుతున్న పోచమ్మ మైదాన్, దేశాయిపేట ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు, యూజీడీ క్లీనింగ్ పనులను బుధవారం సాయంత్రం కమిషనర్ చాహత్ బాజ్ పాయి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నిర్మాణ పనుల్లో నాణ్యత నియమాలు పాటిస్తూ పనులు త్వరగా పూర్తి చేయాల్సిందిగా అధికారులకు ఆదేశించారు.