మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
KMM: సత్తుపల్లి పట్టణంలోని ప్రతి వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మున్సిపల్ యంత్రాంగం పనిచేస్తోందని సత్తుపల్లి మున్సిపల్ ఛైర్‌పర్సన్ రిహానా కమల్ పాషా అన్నారు. ఇవాళ ఉదయం ఆమె పట్టణంలోని 22వ వార్డులో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె వార్డులో తిరుగుతూ స్థానిక పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.