ఇస్కాన్ వద్ద డ్రోన్లతో పటిష్ట బందోబస్తు

అనంతపురంలోని ఇస్కాన్ టెంపుల్లో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు డ్రోన్లు ఎగరవేసి ప్రత్యేక నిఘా ఉంచారు. భక్తులకు అసౌకర్యం, ఇబ్బంది కల్గకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. తోపులాటలు లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయించి దర్శనాలు సాఫీగా జరిగేలా చూస్తున్నారు.