శ్రీవారి హుండీ ఆదాయం లెక్కింపు
ELR: ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయ హుండీల నగదు లెక్కింపు ప్రమోద కళ్యాణ మండపంలో ఇవాళ నిర్వహించారు. 41 రోజులకు జరిపిన ఈ లెక్కింపులో స్వామివారికి రూ. 4,22,31,799 నగదు, 569 గ్రాముల బంగారం, 7.708 కేజీల వెండి వచ్చినట్లు ఆలయ ఈవో NVSN మూర్తి తెలిపారు. ఈ లెక్కింపులో అధికంగా విదేశీ కరెన్సీతో పాటు, రద్దైన పాత కరెన్సీ కూడా వచ్చిందన్నారు.