యూరియా కొరతపై రైతులు ఆందోళన

యూరియా కొరతపై రైతులు ఆందోళన

కృష్ణా: పెదపారుపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద యూరియా కొరతపై పామర్రు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ రైతులతో కలిసి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూ, ఎరువుల సరఫరాలో విఫలమైందని కైలే అన్నారు. చిన్న, కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తక్షణమే సరఫరా మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.