'స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి'
WGL: నల్లబెల్లి మండల BJP పార్టీ కార్యాలయంలో ఇవాళ మండల అధ్యక్షుడు వినయ్ అధ్యక్షతన సమావేశంలో నిర్వహించారు. ఈ సమావేశంలో BJP జిల్లా కార్యదర్శి డా. రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల గురించి ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించాలని దిశ నిర్దేశించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ నాయకులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.