తెలంగాణలో అతిపెద్ద సేవాలాల్ విగ్రహం
TG: రాబోయే రోజుల్లో దేశంలోనే రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టి ఆదర్శవంతంగా తీర్చిదిద్దే మోడల్‌ను ప్రకటించబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వరి ఉత్పత్తి, శాంతి భద్రతల పరిరక్షణ, విద్య, వైద్య రంగాల్లో నెంబర్ 1గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. గిరిజన, ఆదివాసీల కోసం మద్దిమడుగులో అతిపెద్ద సేవాలాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి చేసుకుందామన్నారు.