కుమారుడిని హతమార్చిన తండ్రి
కరీంనగర్: తండ్రి చేతిలో కుమారుడు బలైన ఘటన మానకొండూరు మండల కేంద్రంలో కలకలం రేపింది. పురం కనకయ్య తన చిన్న కుమారుడు శ్రీనివాసు(35)ను సోమవారం అర్ధరాత్రి నిద్రిస్తుండగా తలపై బండతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం నిందితుడు స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు. కుటుంబ కలహాలే ఈ ఘాతుకానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.